సోమవారం 06 జూలై 2020
National - Jun 26, 2020 , 20:24:12

పంజాబ్‌ తొలిమహిళా ప్రధాన కార్యదర్శిగా విని మహాజన్‌

పంజాబ్‌ తొలిమహిళా ప్రధాన కార్యదర్శిగా విని మహాజన్‌

ఛండీఘడ్‌ : పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ తొలిమహిళా ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విని మహాజన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహాజన్‌ 33ఏండ్ల సర్వీసులో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యస్థానాల్లో పని చేశారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న ఐఏఎస్‌ అధికారుల్లో పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఒకేఒక్కరు మహాజన్‌ కావడంతో ప్రభుత్వ కార్యదర్శిగా ఆమెకు అవకాశం దక్కింది.

ప్రస్తుతం ఆమె  కేంద్ర సర్వీసుల్లోని పరిశ్రమలు- వ్యాపారాల్లో పెట్టుబడుల ప్రోత్సాహం, ఐటీ, పాలనలో సంస్కరణలు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ విభాగాలకు అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కరోనా సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోనూ ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య విభాగంలో స్పందన, గుర్తింపు కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కరణ్‌ అవతార్‌ సింగ్‌ స్థానంలో ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కరణ్‌ అవతార్‌సింగ్‌ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. మహాజన్‌ తండ్రి బీబీ మహాజన్‌ కూడా ఐఏఎస్‌ అధికారి కావడం గమనార్హం. 1957 ఐఏఎస్‌ బ్యాచ్‌లో ఆయన టాపర్‌. మ్యాన్‌ ఆఫ్‌ ఇంటిగ్రిటీగా ఆయనకు పేరుంది. పంజాబ్‌ రాష్ట్రంలో పలు ముఖ్యమైన స్థానాల్లో పని చేశారు. 


logo