ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 11:57:42

కరోనా రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌పై రాళ్లతో దాడి

కరోనా రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌పై రాళ్లతో దాడి

బెంగళూరు: కరోనా రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌పై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. కర్ణాటకలోని కమలాపూర్ మండలంలోని మర్మంచి గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇటీవల ఈ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఫలితాలు రాగా 15 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో వారిని దవాఖానకు తరలించేందుకు వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడకు వెళ్లారు. కరోనా సోకిన 15 మందిని అందులో తరలిస్తుండగా మార్గమధ్యలో స్థానికులు, వైద్య సిబ్బందికి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు అంబులెన్స్‌పై రాళ్లతో దాడి చేశారు. వైద్య సిబ్బంది ఫిర్యాదుతో కమలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. logo