శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 14:19:19

కరోనా కలవరం.. గ్రామం నిర్బంధం

కరోనా కలవరం.. గ్రామం నిర్బంధం

డెహ్రాడూన్‌ : కరోనా వైరస్‌ కలవరంతో ఓ గ్రామాన్ని నిర్బంధించారు. ఆ గ్రామంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లాలోని దుంగి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ గ్రామాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

దుంగి గ్రామానికి వచ్చే రహదారులన్నింటినీ మూసివేశారు. ఈ గ్రామంలో సుమారు 250 మందికి పైగా నివసిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప నివాసాల నుంచి బయటకు రావొద్దని స్థానికులను అధికారులు హెచ్చరించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు గ్రామానికి సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు కరోనా కేసులు 68 నమోదు కాగా, 46 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఒకరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. 


logo