శనివారం 11 జూలై 2020
National - Jun 28, 2020 , 14:53:53

సుర్గుజాకు వెలుగు తెచ్చిన ‘సౌభాగ్య’

సుర్గుజాకు వెలుగు తెచ్చిన ‘సౌభాగ్య’

ఛత్తీస్‌గఢ్‌ : ఏళ్ల తరబడిగా కరెంటు లేక కారు చీకట్లో కాలం వెళ్లదీసిన ఆ గ్రామానికి ‘సౌభాగ్య’ పథకం వెలుగులు తీసుకువచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా బల్‌రాంపూర్‌ తాలూకలోని కందా గ్రామానికి అధికారులు సౌభాగ్య పథకం కింద సోలార్‌ ప్యాన్లు ఏర్పాటు చేసి, విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మాట్లాడుతూ విద్యుత్‌ సరఫరాతో తమ జీవితాలను మరింత సులభతరం చేసిందని తెలిపారు. ఇన్నాళ్లు పిల్లల చదువుపై ప్రభావం పడిందని, దీంతో మా తరం మొత్తం బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే మా పిల్లలకు ఇబ్బందులు ఎదుర్కొకపోవడం గొప్పవిషయమని’ చెప్పారు. 'ఇది మాకు స్వాగతించదగ్గ మార్పు, దీంతో మేం రాత్రి పూట చదువుకోవచ్చు. రాత్రి పూట ఇంటి నుంచి బయటకు వెళ్లడం కూడా మాకు చాలా తేలికైంది’ అని మరో విద్యార్థి చెప్పాడు. సౌభాగ్య పథకం కింద 269 ఇళ్లకు లైట్, ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు క్రెడా (ఛత్తీస్‌గఢ్‌ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ) అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సుమన్‌ కిండో తెలిపారు. ఈ విద్యుత్‌ దీపాలు గ్రామస్తుల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు.


logo