సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 11:58:07

గ్రామ‌పెద్దను చంపిన న‌క్స‌ల్స్

గ్రామ‌పెద్దను చంపిన న‌క్స‌ల్స్

ఛ‌త్తీస్ గ‌ఢ్: ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతంలో న‌క్స‌ల్స్ రెచ్చిపోయారు. రాజ్‌నంద్ గావ్ జిల్లాలోని ఔంధిలో ఓ గ్రామ‌పెద్ద‌ను న‌క్స‌లైట్లు ఇవాళ ఉద‌యం కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో రాజ్ నంద్ గావ్ జిల్లాతోపాటు బ‌స్త‌ర్ , దంతెవాడ‌, కాంకెర్‌, నారాయ‌ణ‌పూర్, సుకుమా, బీజాపూర్, కొండ‌గావ్  న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతాలుగా ఉన్నాయి. గ‌తంలోనే ఈ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగ‌లు (ఎస్టీ)ల‌పై ఐపీసీ లోని వివిధ సెక్ష‌న్ల కింద దాదాపు 234 కేసులు న‌మోద‌య్యాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo