సోమవారం 06 జూలై 2020
National - Jun 30, 2020 , 02:05:49

మిడతలపై పోరుకు గ్రామ కమిటీలు

మిడతలపై పోరుకు గ్రామ కమిటీలు

  • విధివిధానాలు రూపొందించిన వ్యవసాయ వర్సిటీ
  • మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు 10 జిల్లాల్లో అమలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిడతల దండు రాష్ట్రంపై దాడిచేసే ప్రమాదం ఉండటంతో వాటిని అరికట్టేందుకు గ్రామస్థాయి ప్రణాళికను ప్రభుత్వం సిద్ధంచేసింది. ప్రతి గ్రామంలోనూ ఒక బృందాన్ని (కమిటీ) ఏర్పాటుచేయాలని, యువతకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. మిడతలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, వ్యూహంపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విధివిధానాలను రూపొందించింది. మిడతలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) రూపొందించిన నిబంధనల్లో తెలంగాణకు అనుకూలంగా స్వల్ప మార్పులుచేసింది. మిడతల దండు ప్రమాదం పొంచి ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పది తెలంగాణ జిల్లాల్లో ఈ నిబంధనలు అమలుచేయాలని సూచించింది. ముందు జాగ్రత్తగా ఈ జిల్లాల్లో అవసరమైన సామగ్రి, రసాయనాల కొనుగోలుకు ప్రభుత్వం శనివారం రూ.53.55 లక్షలను విడుదల చేసింది.

వ్యవసాయ వర్సిటీ సూచనలు 

  • జిల్లాస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేయాలి. ఇందులో కలెక్టర్‌, సీపీ లేదా ఎస్పీ, డీఎఫ్‌వో, డీఏవో, జిల్లా అటవీ అధికారి, వ్యవసాయ వర్సిటీ ప్రతినిధి ఉండాలి. 
  • గ్రామకమిటీలు మిడతల కదలికలను పరిశీలిస్తూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. వీరికి మిడతలను ఎదుర్కోవడంలో శిక్షణ ఇవ్వాలి. 
  • సరిహద్దు గ్రామాల్లో ప్రజలు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. 
  • మిడతలపై దాడికి రాత్రివేళ లేదా తెల్లవారుజాము అనుకూలం. దీనికనుగుణంగా లైటింగ్‌ ఎక్కువగా ఉండేలా ఏర్పాటుచేయాలి. 
  • హెలికాప్టర్‌ ద్వారా సర్వే చేయవచ్చు. ఒకేసారి గరిష్ఠంగా 3 గంటలే సర్వే చేయాలి. 300 మీటర్ల ఎత్తులో మాత్రమే ఎగరాలి. 
  • వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షం పడే సూచనలు ఉన్నపుడు రసాయనాలను చల్లొద్దు. 
  • తక్కువ మోతాదులోనే రసాయనాలను ఉపయోగించాలి. 


logo