గ్యాంగ్ రేప్ బాధితురాలికి గ్రామ బహిష్కరణ

- మహారాష్ట్రలో దారుణం.. పోలీసులకు ఫిర్యాదు
ఔరంగాబాద్: అత్యాచార బాధితురాలికి అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆమెను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరు విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆమె ఇంటికి నోటీసులు అంటించారు. ఆమె ఇంటి చుట్టు పక్కల వాళ్లు అత్యాచారం కంటే ఘోరంగా సూటిపోటి మాటలతో వేధించారు. మా ఊరికి వస్తుందేమో అని చుట్టూ ఉన్న మరో రెండు గ్రామాల వారు కూడా ఆమెను రానివ్వవద్దని తీర్మానం చేశారు. ఈ అమానవీయ ఘటనలపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్న ఊరు, ఇల్లు విడిచి తాను ఎక్కడికీ పోలేనని, న్యాయం చేయాలని వేడుకొన్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ మహిళపై (30) 2015లో నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఏడాది మొదట్లో నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ క్రమంలో బాధితురాలిపై గ్రామస్థుల వేధింపులు పెరిగాయి. ఆగస్టు 15వ తేదీన మూడు గ్రామాలు మహిళను బహిష్కరిస్తూ తీర్మానం చేశాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి