శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 01:08:05

డీఎస్పీ తల కాళ్లు నరికేసి..

డీఎస్పీ తల కాళ్లు నరికేసి..

  • యూపీ గ్యాంగ్‌స్టర్‌ దూబె క్రూరత్వం
  • రైడింగ్‌ విషయం లీక్‌ చేసింది పోలీసులే
  • పోలీసుల అదుపులో దూబె అనుచరుడు

లక్నో/ కాన్పూర్‌, జూలై 5: ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే అనుచరులు అత్యంత క్రూరంగా డీఎస్పీ ర్యాంకు స్థాయి అధికారి తల, కాలి వేళ్లు నరికేసి.. అటుపై ఎస్సైని, కానిస్టేబుల్‌ను అతి దగ్గర నుంచి కాల్చి చంపి, పోలీసుల నుంచి ఆయుధ సామగ్రిని దోచుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. దూబెను అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసుల బృందంపై ఆయన అనుచరులు మావోయిస్టుల మాదిరిగా ఓ పోలీస్‌ స్టేషన్‌పై గెరిల్లా దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, దూబె అనుచరులకు మధ్య శనివారం అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు ఎన్‌కౌంటర్‌ సాగింది. అంతకుముందు అనునిత్యం దూబె వెన్నంటి ఉండే అతడి ముఖ్య అనుచరుడు దయాశంకర్‌ అగ్నిహోత్రి అలియాస్‌ కల్లూ పారిపోతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం వేకువజామున 4.30 గంటలకు కల్యాణ్‌పూర్‌-శివ్లీ రోడ్డుపై అతడిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని హోత్రి కాల్పులు జరిపాడని, తాము జరిపిన ఎదురుకాల్పుల్లో అతడికి గాయమైందని చెప్పారు.

ప్రస్తుతం అగ్నిహోత్రిని చికిత్స కోసం దవాఖానలో చేర్చామని కాన్పూర్‌ వెస్ట్‌ ఎస్పీ అనిల్‌ కుమర్‌ తెలిపారు. దీంతో పోలీసుల అంతర్గత విచారణలో దూబెకు అతడిని అరెస్ట్‌ చేసే సమాచారాన్ని చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి అందజేశాడని తెలియడంతో శనివారం ఆయనను సస్పెండ్‌ చేశారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో గురు, శుక్రవారాల్లో దూబె పరారయ్యాడని పోలీసులు చెప్పారు. వికాస్‌ దూబె అరెస్ట్‌కు ప్రకటించిన నగదు అవార్డును రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచినట్లు ఐజీ అగర్వాల్‌ వివరించారు. దూబె ఇంట్లో భారీగా మందుగుండు సామగ్రి ఉందన్న ఆయన ఇంటిని కూల్చేసినట్లు తెలిపారు.


logo