గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 28, 2020 , 11:19:35

విజ‌య‌వాడ‌లో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

విజ‌య‌వాడ‌లో దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

అమ‌రావ‌తి: న‌కిలీకి అవ‌కాశం ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌ల‌తో క‌రెన్సీ తయారు చేయించినా.. మోసాల‌కు అల‌వాటుప‌డిన కొన్ని ముఠాలు మాత్రం ఏదో ఒక‌ర‌కంగా అస‌లు నోట్ల‌కు అచ్చు గుద్దిన‌ట్లుగా న‌కిలీ నోట్లను ముంద్రించి ప్ర‌జల్లో చ‌లామ‌ణి చేస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విజ‌య‌వాడ న‌గ‌రంలో అలాంటి ఒక ముఠానే భ‌వానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గురు‌వారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ పాన్‌షాప్‌లో న‌కిలీ నోట్ల‌ను మార్పిడి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. వారి నుంచి రూ.3200 న‌కిలీ క‌రెన్సీని, ఒక క‌ల‌ర్ ప్రింట‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.