బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 14:33:35

ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు!

ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు!

తాడేపల్లి: ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న  డాక్టర్‌ను  పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారని  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఇవాళ పలు అంశాలపై విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు చంద్రబాబు. ఎదుటి వారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే వారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా (schadenfreude) అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారు. బాబుది ఆ కేసే!' అని విజయ సాయిరెడ్డి విమర్శించారు. 

'ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే  పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారని' ఆయన పేర్కొన్నారు. 


logo