ఆదివారం 29 మార్చి 2020
National - Mar 07, 2020 , 14:10:25

ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం..!

ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం..!

అమరావతి:  ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.   ఈ నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా  స్పందించారు.  టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

'స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85  శాతానికి ఎలా పెంచుతారని ప్రతాపరెడ్డితో కేసు వేయించి కొట్టేయిస్తాడు. మళ్లీ బీసీ నాయకులను ఉసిగొల్పి కోర్టు చెప్పినంత మాత్రాన 50 శాతానికి ఎలా తగ్గిస్తారని లిటిగేషన్ మొదలు పెడతాడు. ఎన్నికలు జరగొద్దనేది అసలు ఉద్దేశం. సిగ్గు,శరం లేని మనిషి.' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo