బుధవారం 03 జూన్ 2020
National - May 22, 2020 , 17:41:23

'పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోంది'

'పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోంది'

 అమరావతి:  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ  ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లతో బాబుపై విరుచుకుపడ్డారు. 

'కరెంటు బిల్లులపై పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోంది. జాతీయ మీడియా, సోషల్ మీడియాలు వాటిని దీక్షలు అనలేమని తేల్చాయి. ఏసీ గదుల్లో కూర్చుని నిరసన కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే, ప్రజల కోసం కాకుండా ఎల్లో మీడియా కవరేజి కోసం తాపత్రయ పడినట్టు కనిపిస్తోందని' విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. logo