శనివారం 30 మే 2020
National - May 22, 2020 , 12:20:01

'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు'

'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. 'బ్యాంకులను ఎవరు కొల్లగొట్టినా బాబుకు వాళ్లతో సంబంధాలుండటం యాధృచ్ఛికమేం కాదు. తాజాగా ఆర్థిక నేరగాడు బిఆర్ శెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1800 కోట్లు ఎగవేశాడు. అమరావతిలో వేల కోట్లతో హెల్త్ సిటీ పెడుతున్నాడని అప్పట్లో వెంటేసుకుని తిప్పాడు. హవాలా డీల్స్ లో ఈయనకు సాయం చేస్తుంటాడని' విజయ సాయిరెడ్డి ఆరోపించారు. 

'గతంలో తమిళనాడు  సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని చంద్రబాబు సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే. ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదని' విజయ సాయిరెడ్డి విమర్శించారు. 


logo