బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 19:18:19

పోలీసులను ఆశ్రయించిన విజయసాయి రెడ్డి

పోలీసులను ఆశ్రయించిన విజయసాయి రెడ్డి

నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌లో ఉండే వైసీపీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆంద్రప్రదేశ్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తనపై, తమ పార్టీపై సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ ఖాతాలతో అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాతపూర్వకంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన పరువును తీసేందుకు తన పేరిట కూడా ఫేక్‌ అకౌంట్లను తయారు చేసి ఆ ఖాతాల ద్వారా సోషల్‌మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాస్తున్నారని పేర్కొన్నారు విజయసాయి.

అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి తన ఫిర్యాదుపై ఇప్పటికే పోలీసులు విచారణ మొదలుపెట్టారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం  పనులు చేస్తున్న వారు, వారి వెనక ఉన్న వారు కూడా తప్పించుకోలేరని విజయసాయి అన్నారు. అలాగే అటువంటి పోస్టులను షేర్‌ చేసిన వారు, వాటి ఫోటోలను ఇతరులకు పంపిన వారి మీద కూడా చర్యలు తీసుకోమని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.


logo