గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 15:29:20

'ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?'

'ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?'

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ  వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.  చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ హైదరాబాద్‌లో ఉండడంపై కూడా సాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు హైదరాబాద్‌కు  పారిపోయి అర్థశత దినోత్సవం పూర్తయిందని ఆయన విమర్శించారు.  

'అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి. ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?' అని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo