శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 16:12:28

'అప్పుటి దాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ! '

'అప్పుటి దాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ! '

అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పీపీఏల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు

అమరావతి:   టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి   సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై  విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు.  'తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ!

అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బీజేపీ  వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం  దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు.  కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ  పీపీఏల  దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ మోహన్ రెడ్డిని పీపీఏల  రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు' అని విజయ సాయిరెడ్డి ఆరోపించారు. 


logo