శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 16:32:05

మళ్లీ ఛాన్స్ రాదన్నట్టు వనరులన్నింటిని దోచుకున్నాడు!

మళ్లీ ఛాన్స్ రాదన్నట్టు  వనరులన్నింటిని దోచుకున్నాడు!

అమరావతి:  ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.   ఐదేళ్లలో బాబు వనరులన్నింటిని దోచుకున్నాడని విమర్శించారు. 'రోజుకు రెండు గంటలు మైకు ముందు ఉపన్యాసం దంచాలి. వీడియో కెమెరాలు రికార్డు చేసేటప్పుడు వెలిగే రెడ్ లైట్ కనిపించాలి. లేకపోతే ముద్ద దిగదు. మనవడితో కాసేపు ఆడుకుని, ఎల్లో ఛానల్స్ లో తన బొమ్మలను చూసుకున్నాకే నిద్రపోతాడు. ప్రజల గురించి ఆందోళన, కార్యకర్తలకు దిశానిర్ధేశం అంతా ఫేకుడే.' అని ఆయన ఎద్దేవా చేశారు. 

'మళ్లీ ఛాన్స్ రాదన్నట్టు ఐదేళ్లలో బాబు వనరులన్నిటిని దోచుకున్నాడు. అప్పులపాలు చేసి పదేళ్లు వెనక్కు నెట్టి వెళ్లాడు. సీఎం జగన్  పట్టుదల, క్లిష్ట సమయంలో కనబర్చిన పాలనాదక్షత రాష్ట్రాన్ని కోలుకునేలా చేసింది. ఏడాది నిండకముందే ప్రజలు కోరుకున్న సంక్షేమ రాజ్యం వచ్చిందని' విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.  

 


logo