మంగళవారం 31 మార్చి 2020
National - Mar 23, 2020 , 12:35:11

పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ, లేకపోతే..

పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ, లేకపోతే..

 అమరావతి:  టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  కరోనా వైరస్‌ విస్తరించకుండా ఏపీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. 

అత్యంత బాధ్యతతో వ్యవహరించే ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్ మోహన్‌ రెడ్డి  పాలనలో ఉన్నందుకు  రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేది. జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు.

పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికి ఇచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెంట్ కూ ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి.

కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా ‘తుమ్ములు, దగ్గులతో’ పచ్చ వైరస్ ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త!  అని విజయ సాయిరెడ్డి హెచ్చరించారు. 


logo
>>>>>>