బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 19:05:20

సుప్రీం కోర్టే తేలుస్తుంది..నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారం

సుప్రీం కోర్టే తేలుస్తుంది..నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారం

విశాఖపట్నం: రాజ్యాంగ పదవిలో ఉన్న ఏ అధికారి అయినా దేశం కోసం పనిచేస్తారని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించడంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. 

'తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫిర్యాదు చేయడం తప్పుకాదు. నిమ్మగడ్డ రమేష్‌ కాదు నారావారి రమేష్‌. కరోనా వైరస్‌ కంటే   ప్రమాదకరమైన వ్యక్తి‌ రమేష్‌ కుమార్‌. ఎవర్నీ సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు మాత్రమే నమోదైంది.  నైతిక విలువలుంటే రమేష్‌ రాజీనామా చేయాలి. రాష్ట్ర ఎన్నికల అధికారులపై మాకు గౌరవం ఉంది. ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నాం. సుప్రీం కోర్టే తేలుస్తుంది..రమేష్‌ వ్యవహారం. నిమ్మగడ్డ రమేష్‌ చర్య అప్రజాస్వామికమా? కాదా? అనేది కోర్టులో తెలుస్తుందని' విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 


logo