అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది. ఉన్న పనల్లా ఇదే. నాల్రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు.’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం. కొన్ని బతుకులంతే.’ అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నారు.