శనివారం 11 జూలై 2020
National - Jul 01, 2020 , 07:22:26

చైనా యాప్‌ల నిషేదంపై స్పందించిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌

చైనా యాప్‌ల నిషేదంపై స్పందించిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌

న్యూఢిల్లీ : భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. టీక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, షేర్‌ఇట్‌ వంటి తదితర యాప్‌లను దేశంలో నిషేదించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేత నిర్ణయమన్నారు. భారత్‌ స్వయం సంమృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తుందని ప్కేన్నారు. భారత పారిశ్రామికవేత్తలు ప్రజలకు కొత్త ఆవిష్కరణలు అందించాల్సిన సమయం ఇదే అన్నారు.

పేటీఎం యాప్‌ను వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చైనా కంపెనీలైన అలీబాబా, యాంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు భారీ పెట్టుబడులు కూడా పెట్టాయి. అయినప్పటికి విజయ్‌శర్మ చైనా యాప్‌ల నిషేదంపై స్పందించడం విశేషం. 


logo