శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 13:33:36

'వారిద్దరినీ వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి'

'వారిద్దరినీ   వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి'

అమరావతి: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో మండిపడ్డారు. 'పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి. ప్లైట్‌లోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?' అని విజయ సాయిరెడ్డి సూచించారు.  

విశాఖలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయ సాయిరెడ్డి స్పందించారు.   'బాబు నిజ స్వరూపం బయటపడింది. గోదావరి పుష్కరాల్లో 30 నిండు ప్రాణాలు బలితీసుకొని, అలాంటివి కామన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కుంభమేళాలో పోలేదా, జగన్నాథ రథయాత్రలో నలిగిపోలేదా అనే అమానవీయ సమర్థింపు ఆయనకే చెల్లిందని' విజయ సాయిరెడ్డి విమర్శించారు.  ఈ సందర్భంగా   గతంలో బాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్‌ చేశారు. 


logo