శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 13:36:30

విజ‌య్ మాల్యా కేసు పేప‌ర్లు.. సుప్రీంకోర్టులో మిస్సింగ్‌

విజ‌య్ మాల్యా కేసు పేప‌ర్లు.. సుప్రీంకోర్టులో మిస్సింగ్‌

హైద‌రాబాద్‌: విజ‌య్ మాల్యా కేసుకు కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. మాల్యా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సుప్రీంకోర్ట‌లో క‌నిపించ‌డంలేదు.  దీంతో మాల్యా కేసును ఆగ‌స్టు 20వ తేదీకి వాయిదా వేశారు.  జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌, అశోక్ భూష‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది.  బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ‌వేసిన కేసులో విజ‌య్ మాల్యా రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  ఆ కేసును విచారిస్తున్న సుప్రీం ధ‌ర్మాస‌నం.. ఫైళ్ల‌లో మాల్యా డాక్యుమెంట్లు అదృశ్య‌మైన‌ట్లు గుర్తించింది.త‌మ పిల్ల‌ల‌కు 40 మిలియ‌న్ల డాల‌ర్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన విష‌యంలో మాల్యా రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  పేప‌ర్లు క‌నిపించ‌కుండాపోవ‌డంతో క‌క్షిదారులు మ‌రింత స‌మ‌యం కోరారు. logo