ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 19:53:02

కరోనాతో చనిపోయిన వారిని అలా పూడ్చుతారా..?

కరోనాతో చనిపోయిన వారిని అలా పూడ్చుతారా..?

బెంగళూరు: కరోనాతో మరణించిన వారి మృతదేహాలను నిర్లక్ష్యంగా గోతుల్లో పడేడంపై వివాదం చెలరేగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఇటీవల వైరస్‌ బారినపడిన ఎనిమిది మంది చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా, పీపీఈ కిట్లు ధరించిన కొందరు ఆ మృతదేహాలను ఓ చోట తీసిన గోతుల్లోకి విసిరేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ మంగళవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్‌ అయ్యింది. కరోనాతో చనిపోయిన వారిపట్ల అలాగేనా వ్యవహరించేది అని ఆయన ప్రశ్నించారు. 

బళ్లారి డిప్యూటీ కమిషనర్‌ ఈ వీడియోపై స్పందించారు. కరోనాతో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను నిబంధనల ప్రకారం బ్యాగుల్లో ఉంచి ఖననం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే చనిపోయిన వారి పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు విచారకరమని ఆయన అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు బళ్లారి డిప్యూటీ కమిషనర్‌ వివరణ ఇచ్చారు. 


logo