సోమవారం 06 జూలై 2020
National - May 28, 2020 , 10:36:17

భూవివాదం.. ఇద్దరు మహిళలపై దాడి

భూవివాదం.. ఇద్దరు మహిళలపై దాడి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథిలా ఉపాధ్యాయ గ్రామంలో దారుణం జరిగింది. భూవివాదాల నేపథ్యంలో ఇద్దరు మహిళలను కొంతమంది పురుషులు తీవ్రంగా చితకబాదారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళలపై దాడి చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


logo