గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 11, 2020 , 11:53:48

వారి ఇంట్లో సామాన్ల‌న్నీ ఇప్పుడు కారు మీద చూడొచ్చు : వీడియో వైర‌ల్‌

వారి ఇంట్లో సామాన్ల‌న్నీ ఇప్పుడు కారు మీద చూడొచ్చు :  వీడియో వైర‌ల్‌

ఇల్లు మారాలంటే మామూలు విష‌యం కాదు. ఇంట్లో సామాన్ల‌న్నీ ప్యాక్ చేయ‌డం ఒకెత్తు అయితే వాటిని మ‌ర‌లా స‌ర్ద‌డం మ‌రొక ఎత్తు. ఈ సామాన్లన్నింటికీ ఒక వెహిక‌ల్ మాట్లాడితే దూరాన్ని బ‌ట్టి డ‌బ్బులు అడుగుతారు. ఆ డ‌బ్బులు ఇవ్వ‌డం ఎందుకు ద‌గ్గ‌రే క‌దా అని కొంత‌మంది ఒక్కో వ‌స్తువును తీసుకెళ్తుంటారు. కానీ వీళ్లు అలాకాదు. కారు ఉంది క‌దా వేరే వెహిక‌ల్ ఎందుకులే అని పైగా అన్నిసార్లు కూడా తిర‌గ‌డం ఎందుకులే అనుకున్నారేమో..

మొత్తం ఇంటి సామాన్ల‌నే కారు మీద‌కి ఎక్కించేశారు. రోడ్డు మీద కారు వెళ్తుంటే ఇది కారా? ఇళ్లా? అనే సందేహం రాక మాన‌దు. సూట్‌కేసు, సైకిల్‌, బిందెలు, బ్యాగులు ఇలా అబ్బో.. ఎవేం ఉన్నాయో అన్నీ చెప్పేయొచ్చు. దీన్ని చూస్తుంటే కారు మీద ఒక కొండ ఉన్న‌ట్లు కూడా అనిపిస్తుంది. ఈ కారు ఏ మాత్రం అదుపు త‌ప్పినా బోల్తా ప‌డ‌డం ప‌క్కా. మ‌రి ఈ గంద‌ర‌గోళం వీడియోను మీరు కూడా చూసేయండి. logo