ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 15:05:49

మ‌హిళ ప‌రుగెత్తి.. బ‌స్సును ఆపి.. అంధుడికి సాయం.. వీడియో

మ‌హిళ ప‌రుగెత్తి.. బ‌స్సును ఆపి.. అంధుడికి సాయం.. వీడియో

తిరువ‌నంత‌పురం : ఓ కంటి చూపులేని వృద్ధుడు రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ మార్గంలోనే ఓ మ‌హిళ కూడా కాలిన‌డ‌కన వెళ్తుంది. వారికి కొద్ది దూరంలో ఆర్టీసీ బ‌స్సు ఆగి ఉంది. అయితే ఆ బ‌స్సులో వృద్ధుడు వెళ్లాలి. అదే విష‌యాన్ని మ‌హిళ‌కు చెప్పాడు. దీంతో ఆమె ప‌రుగెత్తి.. బ‌స్సు ఆప‌మ‌ని కండ‌క్ట‌ర్ కు చెప్పింది. ఇక వృద్ధుడిని బ‌స్సు వ‌ద్ద‌కు తీసుకెళ్లి ఎక్కించింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది.

ఈ దృశ్యాల‌ను విజ‌య్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. అంధుడికి సాయం చేసిన మ‌హిళ‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ మ‌హిళను తిరువ‌ళ్ల‌కు చెందిన సేల్స్ మెన్ గా గుర్తించారు. 


logo