మంగళవారం 07 జూలై 2020
National - Jun 17, 2020 , 16:11:14

నాగుపాము ప్లాస్టిక్‌ బాటిల్‌ కక్కుతున్న వీడియో వైరల్‌

నాగుపాము ప్లాస్టిక్‌ బాటిల్‌ కక్కుతున్న వీడియో వైరల్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పర్యావరణానికి ఎంత ముప్పో తెలిసిందే. మూగజీవాలు చాలా సందర్భాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని అవి జీర్ణమవక తీవ్ర అస్వస్థకు గురైన సంఘటనలున్నాయి. కొన్నిసార్లు అవి మృత్యువాత పడ్డాయి కూడా. ఇలాంటి ఘటననే భారత అటవీ శాఖ అధికారి సుల్తాన్‌ నందా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నాగుపాము ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగి తీవ్ర అస్వస్థతకు గురై మళ్లీ కక్కుతున్న వీడియోను ఆయన తన  ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేయాలని ట్వీట్లు చేస్తున్నారు. logo