మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 12:43:01

సింహాలు స్విమ్మింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?

సింహాలు స్విమ్మింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?

అహ్మదాబాద్‌:  నీటిలో ఈదులాడటమంటే పులులకు చాలా సరదా. నదులు, సరస్సులు  కనిపిస్తే ఒక్కోసారి గంటల తరబడి ఈతకొడుతూ గడిపేస్తాయి.  కానీ, సింహాలు  అలా కాదు. అవి నీటిలో ఎక్కువసేపు ఉండలేవని, స్విమ్మింగ్‌ చేయడానికి కూడా ఆసక్తి చూపించవని అంటుంటారు.  తాజాగా  గిర్ అడవుల్లోని  నదిని మూడు సింహాలు  ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరిన వీడియో వైరల్‌గా మారింది.  మూడు సింహాలు పక్కపక్కనే స్విమ్మింగ్‌ చేసుకుంటూ నది అవతలి ఒడ్డుకు చేరాయి.  సింహాలు నదిని దాటుతుండగా   ఓ ఫారెస్ట్ గార్డు వీడియో తీశారు.   ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


logo