సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 18:19:10

300 కి.మీ. వేగంతో బైక్‌.. చూసేవారికి చుక్క‌లే!

300 కి.మీ. వేగంతో బైక్‌.. చూసేవారికి చుక్క‌లే!

ఈ త‌రం యువ‌త‌కు బైక్ అంటే భ‌లే స‌ర‌దా. రిమోర్ట్ కారు న‌డిపిన‌ట్లుగా బైక్‌ను అల‌వోక‌గా తిప్పేస్తున్నారు. స్ల‌మ్ ఏరియాలో, చిన్న గ‌ల్లీల్లోనే ర‌య్ ర‌య్ మంటూ దూసుకుపోయే ఆక‌తాయులు హైవే రోడ్డు మీద ఊరుకుంటారా?  వెనుక ఫ్రెండ్స్‌ని కూర్చోబెట్టుకొని హ‌ల్‌చ‌ల్ చేయ‌రు! ఇదిగో బెంగ‌ళూరుకు చెందిన మునియ‌ప్ప అనే 29 ఏండ్ల యువ‌కుడు 1000 సీసీ బైక్ ఎక్కి రోడ్డు మీద షికార్లు కొడుతున్నాడు.

13 కి.మీ. పొడ‌వుండే ఎల‌క్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవ‌ర్‌పై మీద ర‌య్ మంటూ దూసుకుపోయాడు. అత‌ను చేసింది గొప్ప విష‌యం అన్నట్లు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైక్ ఎంత స్పీడ్‌గా వెళ్లిందో అంత‌కంత‌కు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. 200, 300 కి.మీ. వేగంతో దూసుకుపోతుంటే.. ప‌క్క‌నున్న వాళ్ల‌కి రోమాలు నిక్క‌పొడుచుకున్నాయి అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో పోలీసుల దృష్టికి వ‌చ్చింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేసి మునియ‌ప్ప‌ను అరెస్ట్ చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకొని ట్రాఫిక్ పోలీసుల‌కు అప్ప‌గించామ‌ని క్రైమ్ విభాగం జాయింట్ క‌మిష‌న‌ర్ సందీప్ పాటిల్ తెలిపారు. logo