సోమవారం 25 జనవరి 2021
National - Dec 24, 2020 , 16:07:26

కర్ణాటకలో మూడు రోజులపాటు ఉప రాష్ట్రపతి పర్యటన

కర్ణాటకలో మూడు రోజులపాటు ఉప రాష్ట్రపతి పర్యటన

బెంగళూర్‌ : భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయకుడు మూడు రోజులపాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన అధికార పర్యటన ఖరారైంది. డిసెంబర్‌ 29న ఉదయం ఢిల్లీ నుంచి ఆయన బయల్దేరి బెంగళూర్‌లోని కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడ నుంచి బెంగళూర్‌ రూరల్‌ జిల్లా పరిధి హోసాకోట్‌లోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని (సీఆర్‌ఈఎస్‌టీ) ఆయన సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు చేరుకొని 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. 31న ఉదయం బెంగళూర్‌ నుంచి చెన్నై వెళతారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo