సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 21:46:29

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం ఉదయం ఆయన కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. కాగా, ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు వైస్‌ప్రెసిడెంట్‌ సెక్రటేరియెట్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంకయ్య నాయుడు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే, ఆయన సతీమణి ఉషా నాయుడు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది.  

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo