బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 10:21:23

రైలు ప్రమాదంపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

రైలు ప్రమాదంపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : ఔరంగాబాద్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు వెంకయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మహారాష్ట్ర ఔరంగాబాద్‌ సమీపంలోని కర్మాడ్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై వలస కార్మికులు నిద్రిస్తున్న క్రమంలో వారిపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు నడుచుకుంటూ వలస కార్మికులు వెళ్తున్నారు. అలసిపోయి భూసానల్‌ - జాల్నా మధ్య కర్నాడ్‌ వద్ద పట్టాలపై వలస కార్మికులు పడుకున్నారు. 


logo