గురువారం 21 జనవరి 2021
National - Jan 13, 2021 , 08:07:06

గోవాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య భోగి వేడుకలు

గోవాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య భోగి వేడుకలు

పనాజీ: తెలుగు ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకువాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవాలోని రాజ్ భవన్‌లో భోగిమంట వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ‘భోగి పండుగ శుభాకాంక్షలు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందో త్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను వదలి సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తాయి. భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.logo