బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 12:56:33

విశాఖ గ్యాస్‌ లీక్‌ మృతులకు ఉపరాష్ట్రపతి సంతాపం

విశాఖ గ్యాస్‌ లీక్‌ మృతులకు ఉపరాష్ట్రపతి సంతాపం

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించిన ఉపరాష్ట్రపతి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అదేవిధంగా కేంద్ర హోంశాఖ సెక్రటరీతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా కోరినట్లుగా పేర్కొన్నారు. 


logo