గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 01:55:45

ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ కన్నుమూత

ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త పరమేశ్వరన్‌ కన్నుమూత
  • ప్రధాని మోదీ, అమిత్‌ షా, కేరళ గవర్నర్‌, సీఎం నివాళి

కొచ్చి: ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త, రచయిత పీ పరమేశ్వరన్‌(93) కన్నుమూశారు. కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా ఒట్టపళంలోని ఓ ఆ యుర్వేద దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచా రు. చిన్నప్పుడు ఆరెస్సెస్‌ పట్ల ఆకర్షితుడైన పరమేశ్వరన్‌ .. జనసంఘ్‌ కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా.. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. దీన్‌దయాల్‌ ఉపాధ్యా య, వాజపేయి, అద్వానీ తదితరులతో కలిసి పనిచేశారు. కేరళలో జాతీయవాద ఆలోచనల విస్తరణకు చర్యలు తీసుకున్నారు.


ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2004లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్‌ అవార్డులను ప్రదా నం చేసింది. ఆయన మృతికి ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌, సీఎం విజయన్‌ సం తా పం తెలిపారు. ‘పరమేశ్వర్‌ జీ ఆలోచనలు ఫలవంతమైనవి, అత్యుత్తమం, ఆయన ఎవరికీ లొంగలేదు’ అని మోదీ ట్వీట్‌చేశారు. పరమేశ్వరన్‌ మృతదేహాన్ని ఆదివారం కొచ్చిలోని ఆరెస్సెస్‌ ప్రధానకార్యాలయంలో ఉంచారు. సంఘ్‌, బీజేపీ నేతలు , ప్రజలు ఆయన మృతదేహానికి నివాళలర్పించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన స్వస్థలమైన అలప్పుజ జిల్లాలోని ముహమ్మ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తామని సంఘ్‌ నేతలు తెలిపారు.


logo
>>>>>>