e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌

అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌

అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌


ముంబై: అల‌నాటి న‌టుడు, ‘రామాయణ్’ ధారావాహికతో మంచి గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ (98) క‌న్నుమూశారు. దర్శకుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్ర‌శేఖర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బుధవారం ఉదయం స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. నాన్నగారు నిద్రలోనే మ‌ర‌ణించార‌ని, ఈ సాయంత్రం ఆయ‌న‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని చంద్ర శేఖర్ త‌న‌యుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు.

1923లో హైదరాబాద్‌లో పుట్టిన చంద్రశేఖర్ నటనపై ఉన్న మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆ తర్వాత ‘సురంగ్’ అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్‌’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్‌’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్‌’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. 250కిపైగా చిత్రాల్లో చంద్రశేఖర్ కనిపించారు.

- Advertisement -

1964లో స్వీయ నిర్మాణంలో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1966లో ‘స్ట్రీట్ సింగర్’ అనే సినిమాని తెరకెక్కించారు. 1970ల్లో ‘పరిచయ్‌’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో (డీడీ ఛానల్‌) విశేష ప్రేక్షకాదరణ పొందారు. అందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. కాగా, చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌
అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌
అల‌నాటి న‌టుడు చంద్ర‌శేఖ‌ర్ క‌న్నుమూత‌

ట్రెండింగ్‌

Advertisement