బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 21:54:38

దివ్యాంగుల కోసం "వీ–ఎన్‌హాన్స్‌"ను ఆవిష్కరించిన వెస్టిజ్‌

దివ్యాంగుల కోసం

ఢిల్లీ: భారతదేశంలో సుప్రసిద్ధ, దేశీయంగా వృద్ధి చెందిన డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ, వెస్టిజ్‌ ఇప్పుడు ఈ–శిక్షణా కార్యక్రమం వీ–ఎన్‌హాన్స్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం వినికిడి, మూగ సమస్య  ఉన్న పంపిణీదారులకు సహాయపడటంతో పాటుగా వెస్టిజ్‌ మార్కెటింగ్‌ ఆరోగ్య, వెల్‌నెస్‌ ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలను సంజ్ఞా భాషల ద్వారా అర్ధం చేసుకోగలుగుతారు. పరిశ్రమలో మొట్టమొదటి  కార్యక్రమంగా ప్రశంసలు పొందిన వీ–ఎన్‌హాన్స్‌ కార్యక్రమం, ప్రజలకు ఆర్ధిక స్వేచ్ఛను అందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

‘‘అంతర్జాతీయంగా విభిన్న వ్యక్తులకు సమానమైన అవకాశాలను వెస్టిజ్‌ అందిస్తుంది. మా వరకూ, ప్రతి పంపిణీదారుడూ మాకు అత్యంత విలువైన భాగస్వామి. అందువల్ల, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులకు కూడా ఎదిగేందుకు సమాన అవకాశాలను అందించాలని భావించాము. ఆ నేపథ్యంతోనే వీ–ఎన్‌హాన్స్‌ను తీర్చిదిద్దాము’’ అని  వెస్టిజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ బాలీ అన్నారు. రెండు నెలల పాటు జరిగే శిక్షణా కార్యక్రమంలో వెస్టిజ్‌ అందించే పలు ఆరోగ్య, వెల్‌నెస్‌ ఉత్పత్తులను గురించి వివరిస్తారు. ప్రతి వారం మహిళా ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, గ్లైసెమిక్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌,డైట్‌ వంటి ఎన్నో అంశాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీ–ఎన్‌హాన్స్‌ శిక్షణా కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం www.myvestige.com చూడవచ్చు.   


logo