మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Apr 26, 2020 , 11:17:09

త్రివిధ ద‌ళాల్లో కోవిడ్ కేసులు త‌క్కువే: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌

త్రివిధ ద‌ళాల్లో కోవిడ్ కేసులు త‌క్కువే:  సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌

హైద‌రాబాద్: త్రివిధ ద‌ళాల్లో చాలా త‌క్కువ సంఖ్య‌లో కోవిడ్‌19 కేసులు న‌మోదు అయిన‌ట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ద‌ళాల్లో ఉన్న క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌హ‌నం వ‌ల్లే వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోగ‌లిగామ‌న్నారు. త్రివిధ ద‌ళాల‌కు చెందిన‌వారంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఒక‌వేళ వైర‌స్ ఎవ‌రికి సంక్ర‌మించినా, అది తొంద‌ర‌గా తెలిసిపోతుంద‌న్నారు. వ్యాప్తి జ‌ర‌గ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. శాస్త్ర‌వేత్త‌లు, ఇత‌ర ఏజెన్సీలు ఇస్తున్న మెడిక‌ల్ ఎక్విప్మెంట్‌ను అంద‌రికీ చేర‌వేస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం మ‌నం విదేశాల నుంచి ఆయుధాల‌ను దిగుమ‌తి చేస్తున్నామ‌ని, కానీ ఒక‌వేళ మ‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ ఛాలెంజ్ ఇస్తే, మ‌నం కూడా ఆయుధాల‌ను త‌యారు చేసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.  ఎప్పుడూ స్వ‌యం స‌మృద్ధిగా ఉండాల‌న్న గుణ‌పాఠాన్ని కోవిడ్‌19 నేర్పింద‌న్నారు.  త‌మ‌కు ఇచ్చిన బ‌డ్జెట్‌ను పూర్తిగా వినియోగిస్తామ‌ని, వ్య‌ర్థం కాకుండా చూస్తామ‌న్నారు.  త్రివిధ ద‌ళాల్లో ఉన్న సైనికులంతా నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌న్నారు. ఎటువంటి ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకైనా రెఢీగా ఉన్న‌ట్లు చెప్పారు. త‌మ‌కు ఏదైనా టాస్క్ ఇస్తే, దాన్ని నెర‌వేరుస్తామ‌న్నారు. 

ప్రాంతీయ శ‌క్తిగా భార‌త్ ఎదుగాల‌నుకుంటున్న‌ద‌ని, అలాంటి స‌మ‌యంలో మ‌నం మ‌రొక‌రికి అండ‌గా నిల‌వాల‌ని, ఇత‌రుల స‌హాయం తీసుకోరాద‌న్నారు.  మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశంలోనే ఆయుధాలు త‌యారు చేసే స్థితికి ఎద‌గాల‌న్నారు.