సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 19:34:03

అయోధ్య రాములోరికి వెంకయ్య కుటుంబం విరాళం

అయోధ్య రాములోరికి వెంకయ్య కుటుంబం విరాళం

న్యూఢిల్లీ : అయోధ్యలో నిర్మించనున్న రామాలయం నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం విరాళం అందజేసింది. అదేవిధంగా పీఎం కేర్స్ నిధికి కూడా తమ వంతు విరాళం అందజేయాలని నిర్ణయించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య సతీమణి శ్రీమతి ఉషమ్మ చొరవ తీసుకుని కుమారుడు హర్ష, కోడలు రాధ, కుమార్తె దీపావెంకట్, అల్లుడు వెంకట్ ఇమ్మణ్నితో కలిసి చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు పీఎం కేర్స్ నిధికి రూ.5 లక్షలు, అదేవిధంగా అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం కోసం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు మరో రూ.5 లక్షల చెక్కును పంపించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఏడాది మార్చిలో కరోనా పోరాటానికి గానూ పీఎం కేర్స్ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడంతోపాటు.. కరోనా పరిస్థితులు చక్కబడేంతవరకు ఈ నిధికి తన వేతంలో 30 శాతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.


logo