శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:30:16

శృంగేరి-మంగ‌ళూరు ర‌హ‌దారిపై రాక‌పోక‌లు బంద్‌

శృంగేరి-మంగ‌ళూరు ర‌హ‌దారిపై రాక‌పోక‌లు బంద్‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లుచోట్ల లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయి. చిక్‌మంగ‌ళూరు జిల్లాలోని శృంగేరి-కుద్రేముఖ్‌-మంగ‌ళూరు ర‌హ‌దారిపై అక్క‌డ‌క్క‌డ కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. కొన్నిచోట్ల కొండ‌చ‌రియ‌లు ప‌డి రోడ్డు తెగిపోయింది. దీంతో ఆ ర‌హ‌దారిపై వాహ‌నాల రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా, ర‌హ‌దారిపై కొండ‌చరియ‌లను తొల‌గించి, రోడ్డుకు మ‌ర‌మ్మ‌తులు చేసిన త‌ర్వాత వాహ‌నాల‌ను తిరిగి అనుమ‌తిస్తామ‌ని అధికారులు తెలిపారు.          

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo