బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:26:15

ప‌డిపోయిన వాహ‌నాల రిజిస్ర్టేష‌న్లు

ప‌డిపోయిన వాహ‌నాల రిజిస్ర్టేష‌న్లు

ఢిల్లీ : వాహ‌నాల రిజిస్ర్టేష‌‌న్లు జూన్ నెల‌లో 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆటోమొబైల్ అసోసియేష‌న్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. నెల‌ల వారీగా వాహ‌నాల రిజిస్ర్టేష‌న్ వివ‌రాల‌ను ఎఫ్ఏడీఏ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. ఏడాది ప్రాతిప‌దిక‌న ద్విచ‌క్ర వాహ‌నాల‌ విభాగంలో 40.92 శాతం, త్రిచ‌క్ర వాహ‌నాల విభాగంలో 75.43 శాతం, వాణిజ్య వాహ‌నాల విభాగంలో 83.83 శాతం, ప్ర‌యాణికుల వాహ‌నాల విభాగంలో 38.34 శాతం ప‌డిపోయింది. కాగా ట్రాక్ట‌ర్ల రిజిస్ర్టేష‌న్లు 10.86 శాతం పెరిగిన‌ట్లు ఎఫ్ఏడీఏ తెలిపింది. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో మే నెల‌తో పొల్చితే వాహ‌నాల రిజిస్ర్టేష‌న్లు కాస్త పెరిగాయి. గ్రామీణ మార్కెట్లో బలమైన డిమాండ్ ఉన్న ట్రాక్టర్ల అమ్మకాలు రిజిస్ర్టేష‌న్ల రిక‌వ‌రీకి పెంపుద‌ల‌కు దారితీసింది. ఆటో రంగం పున‌రుత్తేజానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎంతో ఉప‌యుక్తం కానుంద‌ని ఎఫ్ఏడీఏ పేర్కొంది. రాబోయే నెల‌ల్లో వాహ‌నాల రిజిస్ర్టేషన్ల వృద్ది జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేసింది. 


logo