బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:25:15

కూరగాయల వ్యాపారులు, అడ్డకూలీలుగా మారుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

కూరగాయల వ్యాపారులు, అడ్డకూలీలుగా మారుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

ముంబై : మాయదారి కరోనా వచ్చి మధ్యతరగతి, పేదల కడుపు మీద కొట్టింది. దేశవ్యాప్తంగా కొన్నికోట్ల మంది ప్రైవేట్‌ ఉద్యోగులు నేడు ఉపాధి కోల్పోయి రోజువారి కూలీలుగా మారారు. కూరగాయలు, పాలు, పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది ప్రైవేట్‌ టీచర్లు వ్యవసాయ కూలీలు, అడ్డమీద కూలీలుగా మారిన పరిస్థితి దాపురించింది. కరోనా వ్యాప్తిని నివారించే౦దుకు గాను మార్చిలో లాక్‌డౌన్‌ విధించగా చాలా పాఠశాలలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. దీంతో వారు సేది లేక ఏదో ఒక పని చేసుకొని జీవిస్తున్నారు.

ఇక వ్యాపారాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉద్యోగాలు ఉన్నవారికి కూడా కంపెనీలు సగం వేతనమే చెల్లిస్తుండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేందుకు జనం ముందుకు రావడం లేదు. ఫలితంగా చాలా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. 

ముంబైకి చెందిన ప్రసాద్ భోసలే అనే ఫుట్‌బాల్ కోచ్ ఇప్పుడు కూరగాయలను అమ్ముతున్నాడు. "నేను ఒక పాఠశాలలో శారీరక విద్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడిని. లాక్‌డౌన్‌ కారణంగా నన్ను విధుల నుంచి తొలగించారు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతో చేసేది లేక కూరగాయలు విక్రయిస్తున్నాను. 2 నెలల నుంచి ఇదే పని చేస్తూ జీవనం సాగిస్తున్నా.. నేనే కాదు నాతో పాటు చాలా మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయలను విధుల నుంచి తొలగించడంతో ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు’’ అని ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. logo