మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 22:42:52

స‌చిన్ పైల‌ట్‌ది తొంద‌ర‌పాటు చ‌ర్య‌: వీర‌ప్ప మొయిలీ

స‌చిన్ పైల‌ట్‌ది తొంద‌ర‌పాటు చ‌ర్య‌: వీర‌ప్ప మొయిలీ

న్యూఢిల్లీ: రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌తో విభేదించి ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీని వీడిన డిప్యూటీ సీఎం స‌చిన్‌పైల‌ట్‌ది తొంద‌ర‌పాటు చ‌ర్య అని ఆ పార్టీ సీనియ‌ర్ నేత వీర‌ప్ప మొయిలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ స‌చిన్‌ పైలట్‌ను ఎంపీని చేసింద‌ని, కేంద్ర మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చింద‌ని, ఇప్పుడు రాజస్థాన్‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టింద‌ని మొయిలీ చెప్పారు. ఇన్ని చేసినా పార్టీలో గుర్తింపు లేద‌ని ఆరోపిస్తూ బ‌య‌ట‌కు వెళ్ల‌డం తొంద‌ర‌పాటే చ‌ర్యేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.  

అయినా, స‌చిన్ పైల‌ట్‌కు ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించి ప‌రిష్క‌రించుకుంటే బాగుండేద‌ని మొయిలీ పేర్కొన్నారు. సీఎం కావాలంటే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరమ‌ని, ఆయ‌న‌కు తొందరపాటు తగదని అన్నారు. పైల‌ట్ వ‌య‌సు చిన్న‌ద‌ని, ఆయ‌న‌కు బోలెడంత భవిష్యత్తు ఉందని చెప్పారు. ఇప్ప‌టికైనా తన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీయేనని పైలట్ గుర్తించాలని మొయిలీ సూచించారు. అయితే, బీజేపీలో చేరబోనని పైలట్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo