సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 18:01:26

వసుంధర రాజేకు కరోనా నెగెటివ్‌

వసుంధర రాజేకు కరోనా నెగెటివ్‌

రాజస్థాన్‌ : రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజేకు కరోనా నెగెటివ్‌గా తేలింది. దీనిపై ఆమె స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాను, తనతో పాటు తన కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ 15 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండనున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా వసుంధరా రాజే కృతజ్ఞతలు తెలిపారు. 

బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా కపూర్‌ ఇటీవల లక్నోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారందరిలో ఆందోళన నెలకొంది. కార్యక్రమానికి హాజరైన పలువురు స్వీయ నిర్బంధం విధించుకున్నారు.


logo