బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 02:34:58

యూపీఎస్సీ కార్యదర్శిగా వసుధా మిశ్రా

యూపీఎస్సీ కార్యదర్శిగా వసుధా మిశ్రా

న్యూఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కార్యదర్శిగా వసుధా మిశ్రా నియమితులయ్యారు. వసుధామిశ్రా 1987 బ్యాచ్‌ తెలంగాణ ఐఏఎస్‌ అధికారి. సిబ్బంది నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమెను తాత్కాలికంగా యూపీఎస్సీ కార్యదర్శిగా నియమించింది. సీబీఎస్‌ఈ చైర్మన్‌గా మనోజ్‌ అహుజా, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా కే శ్రీనివాస్‌, ఆర్కియాలజీకల్‌ సర్వేఆఫ్‌ ఇండి యా డైరెక్టర్‌ జనరల్‌గా వీ విద్యావతి, ఈఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా రాజేంద్రకుమార్‌ నియమితులయ్యారు. logo