మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 19:56:18

వరవరరావును విడుదల చేయాలి: మావోయిస్టులు

వరవరరావును విడుదల చేయాలి: మావోయిస్టులు

హైదరాబాద్‌ : ఓ కేసు విషయంలో జైలుపాలైన విప్లవ నేత వరవరరావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ జులై 25న తెలంగాణలో బంద్‌కు పిలుపునిచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కోరింది. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి వరవరరావు ముంబయిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 

అడవుల్లో గస్తీ కాస్తున్న గ్రేహౌండ్స్ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించాలని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ బహిరంగ లేఖలో డిమాండ్ చేసింది. వరవరరావుపై మోపిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo