శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 13:01:43

ముంబై జేజే హాస్పిట‌ల్‌లో వ‌ర‌వ‌ర‌రావు అడ్మిట్‌

ముంబై జేజే హాస్పిట‌ల్‌లో వ‌ర‌వ‌ర‌రావు అడ్మిట్‌

హైద‌రాబాద్‌: విప్ల‌వ ర‌చ‌యిత, క‌వి వ‌ర‌వ‌ర‌రావు.. ముంబైలోని జేజే హాస్పిట‌ల్‌లోని న్యూరాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిట్ అయ్యారు.  81 ఏళ్ల విర‌సం నేత ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్నా.. కొన్ని రోజుల నుంచి ఆయ‌న బ‌ల‌హీనంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్లు ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. వ‌ర‌వ‌ర‌రావు శ‌రీర స్పంద‌న స‌రిగానే ఉంద‌ని జేజీ హాస్పిట‌ల్ సూప‌రిటెండెంట్ జేజే సంజ‌య్ తెలిపారు.  భీమా కోరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావు జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు.  త‌లోజా సెంట్ర‌ల్ జైలులో ఉన్న ఆయ‌న్ను.. జూలై 13వ తేదీన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు.  

క‌వి వ‌ర‌వ‌ర‌రావును జేజే హాస్పిట‌ల్‌లో చేర్పించిన‌ట్లు ప్రిజ‌న్స్ ఏడీజీ సునిల్ రామానంద్ ద్రువీక‌రించారు. అయితే ప‌రీక్ష‌ల ఆధారంగా ఆయ‌న్ను ఆస్ప‌త్రిల్లో ఉంచాలా లేదా అన్న అంశాన్ని డాక్ట‌ర్లు తేల్చ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. జైలు నుంచి హాస్పిట‌ల్‌కు త‌న తండ్రిని తీసుకువెళ్లిన‌ట్లు అధికారులు చెప్ప‌లేద‌ని కూతురు ప‌వ‌న తెలిపింది. జూలై 13న త‌లోజా జైలు అధికారితో మాట్లాడ‌మ‌ని, త‌న తండ్రి బాగానే ఉన్న‌ట్లు అధికారులు చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.  వ‌ర‌వ‌ర‌రావు న‌డవ‌లేక‌పోతున్న‌ట్లు జైలులో ఆయ‌న‌తో శిక్ష‌ను అనుభ‌విస్తున్న‌ వెర్నాన్ గోంజాల్వెస్ తెలిపారు. 
logo