మంగళవారం 07 జూలై 2020
National - Jun 21, 2020 , 19:23:00

బహ్రెయిన్‌ నుంచి తిరువనంతపురానికి చేరిన 181మంది భారతీయులు

 బహ్రెయిన్‌ నుంచి తిరువనంతపురానికి చేరిన 181మంది భారతీయులు

మనమ : వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బహ్రెయిన్‌ నుంచి 181మంది భారతీయులు కొజికోడ్‌ మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో బహ్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెట్‌ ఐఎక్స్‌-1574ను ఏర్పాటు చేసింది. ఇందులో 181మంది భారతీయులతోపాటు ఇద్దరు శిశువులు స్వదేశానికి చేరుకున్నారు.  గత నెల వందే భారత్‌ మిషన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల్లోని 2,50,087మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. వందే భారత్‌ మిషన్‌ మే 7న ప్రారంభం కాగా ఇప్పుడు మూడో విడుత కొనసాగుతోంది. జూన్‌ 7నుంచి మూడో విడుత ప్రారంభం కాగా ఇందుకు 550 విమానాలను 191 ఫీడర్‌ విమానాలను కేటాయించారు.


logo