శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 09:25:58

వచ్చే నెల 3 నుంచి నాలుగో విడత వందే భారత్‌

వచ్చే నెల 3 నుంచి నాలుగో విడత వందే భారత్‌

న్యూఢిల్లీ: కరోనాతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం కొనసాగించనుంది. నాలుగో విడత వందే భారత్‌ మిషన్‌ జూలై 3 నుంచి 15 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఇందులో భాగంగా 17 దేశాలకు 170 ప్రత్యేక విమానాలను నడపనున్నామని తెలిపింది. ఇందులో అమెరికాకు 31 విమానాలు, యూకేకు 19 విమానాలు వెళ్లనున్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా 114 విమానాలను నడపనుందని పేర్కొంది. 

నాలుగోవిడతలో భాగంగా కెనడా, బ్రిటన్‌, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, కిర్గిజ్‌స్థాన్‌, సౌదీఅరేబియా, బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, రష్యా, మయాన్మార్‌, అమెరికా, జపాన్‌, ఉక్రెయిన్‌ దేశాల్లో ఉన్న భారతీయలను స్వదేశానికి తరలించనున్నామని వెల్లడిచింది. ఇప్పటికే మూడు విడతలు పూర్తిచేసుకున్న వందేభారత్‌ కార్యక్రమాన్ని మే 6న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.  మూడో విడత కార్యక్రమంలో 43 దేశాల నుంచి 495 విమానాల ద్వారా ప్రయాణికులను భారత్‌కు తరలిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 23న అంతర్జాతీయ విమానాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.


logo